తిరుమలలో గంజాయి విక్రయాలు తెలుగు వారికే సిగ్గుచేటు: వర్ల రామయ్య

జగన్‌ పాలనలో తిరుమల కొండపై గంజాయి అమ్మకాలు జరగడం తెలుగు వారికే సిగ్గుచేటని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. 

Updated : 27 Mar 2023 04:53 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగన్‌ పాలనలో తిరుమల కొండపై గంజాయి అమ్మకాలు జరగడం తెలుగు వారికే సిగ్గుచేటని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు.  సీఎం, ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో గంజాయి సాగు, అమ్మకాలు జరుగుతున్నాయని విమర్శించారు.  వైవీ సుబ్బారెడ్డిని తక్షణమే తితిదే పాలకమండలి ఛైర్మన్‌ పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ తితిదేలో పనిచేసేవారే గంజాయి అమ్ముతుంటే, వారిపై చర్యలు తీసుకోరా? దేశవ్యాప్తంగా అత్యధికంగా గంజాయి సాగయ్యే రాష్ట్రాల్లో ఏపీ తొలిస్థానంలో ఉందని నార్కోటిక్‌ కంట్రోల్‌ బోర్డే చెప్పింది. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలో దొరుకుతున్నాయి. మంత్రి అమర్‌నాథ్‌ దృష్టిలో... ఈజ్‌ ఆఫ్‌ బిజినెస్‌ అంటే గంజాయి, మాదకద్రవ్యాల వ్యాపారమేనా?...’’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు