ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందేమో...?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా బలపర్చిన అభ్యర్థులు ఓడిపోయారంటే.. ఆ మేరకు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందేమోనని  డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి వ్యాఖ్యానించారు.

Published : 28 Mar 2023 04:25 IST

సరిదిద్దుకోవడానికి ఇదో అవకాశంగా భావిస్తున్నాం: డిప్యూటీ స్పీకర్‌

విజయనగరం, న్యూస్‌టుడే: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా బలపర్చిన అభ్యర్థులు ఓడిపోయారంటే.. ఆ మేరకు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందేమోనని  డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి వ్యాఖ్యానించారు. సరిదిద్దుకోవడానికి ఇదో అవకాశంగా తాము భావిస్తున్నామని చెప్పారు. సోమవారం విజయనగరంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగుకు పాల్పడ్డారని అన్ని విధాలా నిర్ధారించిన తర్వాతే నలుగుర్ని అధిష్ఠానం సస్పెండ్‌ చేసిందన్నారు.  ‘సస్పెండైన వారు పశ్చాత్తాపపడటం లేదు.ఎక్కడో వైద్యవృత్తి చేసుకుంటున్న శ్రీదేవిని తెచ్చి గెలిపించాం. ఆమె ఏనాడూ పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కాలేదు. ప్రజల్లో ఆమె పట్ల విశ్వాసం లేదనే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే అక్కడ పార్టీ ఇన్‌ఛార్జిని మార్చాం...’ అని కోలగట్ల పేర్కొన్నారు. మంత్రి పదవులు ఇవ్వకపోతే పార్టీ మారే ఆనవాయితీ ‘ఆనం’కు ఉందని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ఓటేసినా చర్యలు తీసుకుంటామని ఓ ప్రశ్నకు సమాధానంగా కోలగట్ల చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని