ఎమ్మెల్యే శ్రీదేవి ప్రచార వాహనాన్ని తీసుకుపోయిన వైకాపా నేతలు
గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి వైకాపా నేతల వేధింపులు పెరిగాయి.
గృహోపకరణాలు తీసుకెళ్లేందుకూ యత్నం
ఎమ్మెల్యే కార్యాలయంలో వైకాపా నేత సందీప్ హల్‌చల్
గుంటూరు, ఫిరంగిపురం, తాడికొండ, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి వైకాపా నేతల వేధింపులు పెరిగాయి. గుంటూరు చంద్రమౌళినగర్‌లోని ఎమ్మెల్యే శ్రీదేవి కార్యాలయం వద్ద వైకాపా నేత సందీప్ సోమవారం తన అనుచరులతో వచ్చి హల్‌చల్ చేశారు. ఎమ్మెల్యే వినియోగించిన ప్రచార వాహనాన్ని ఆమె లేనప్పుడు దౌర్జన్యంగా తీసుకెళ్లడం వివాదానికి దారి తీసింది. వైకాపా నేతలు ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు వచ్చిన విషయం తెలుసుకుని పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో తామంతా చందాలు వేసుకొని ప్రచార వాహనాన్ని కొనుగోలు చేసి శ్రీదేవికి ఇచ్చామని వైకాపా నేత సందీప్ పోలీసులకు తెలిపారు. వాహనం తన సోదరి పేరుపై ఉందని చెప్పి పత్రాలు చూపడంతో వాహనాన్ని తీసుకువెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. సందీప్ అంతటితో ఆగకుండా కార్యాలయంలోని ఫ్రిజ్ కూడా తాను కొనిచ్చానని, కార్యాలయంలోని ప్రతి వస్తువు వైకాపా నేతల చందాలతో కొనుగోలు చేసినవేనని ఆరోపించారు. ఆధారాలు చూపించి అన్ని వస్తువులు తీసుకెళ్తామన్నారు. ఎన్నికల సమయంలో చందాలు వేసుకుని గెలిపిస్తే పార్టీకి, కార్యకర్తలకు శ్రీదేవి నమ్మకద్రోహం చేశారంటూ నినాదాలు చేశారు. ప్రచార వాహనం మాత్రమే తీసుకెళ్లడానికి పోలీసులు అనుమతి ఇవ్వడంతో దానిని తీసుకుని వెళ్లిపోయారు. ఈ తంతు చూసిన స్థానికులు ఎమ్మెల్యే లేని సమయంలో దౌర్జన్యంగా వాహనం తీసుకువెళ్లడం సరికాదన్నారు. పోలీసులు అడ్డుకోకపోవడం విమర్శలకు దారి తీసింది.
* మరోవైపు ఫిరంగిపురం, లాం గ్రామాల్లో వైకాపా శ్రేణులు సోమవారం ఎమ్మెల్యే శ్రీదేవి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ... ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Adipurush: ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్‌కు అతిథిగా చినజీయర్ స్వామి
-
India News
పునరుద్ధరించిన పట్టాలపై గూడ్స్ రైలు.. ఊపిరి పీల్చుకున్న రైల్వే మంత్రి..!
-
General News
TS High Court: భారాస ఎంపీ ఫౌండేషన్‌కు భూ కేటాయింపు.. రద్దు చేసిన హైకోర్టు
-
World News
USA: విమానాన్ని వెంబడించిన ఫైటర్ జెట్.. సానిక్ బూమ్‌తో హడలిన వాషింగ్టన్
-
India News
Odisha: ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. ఓవల్ మైదానంలో టీమ్ఇండియా రికార్డులు ఇలా..