ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలపై రూ.5.50 లక్షల తలసరి అప్పు

వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో (2024 మార్చి వరకు) రాష్ట్ర ప్రజలపై రూ.5.50 లక్షల తలసరి అప్పు మోపనుందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తెలిపారు.

Published : 28 Mar 2023 04:25 IST

2024 మార్చినాటికి రూ.12.50 లక్షల కోట్లకు రుణ భారం
తెదేపా నేత యనమల

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో (2024 మార్చి వరకు) రాష్ట్ర ప్రజలపై రూ.5.50 లక్షల తలసరి అప్పు మోపనుందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. 2021-22 సంవత్సరానికి రాష్ట్ర ప్రజల తలసరి అప్పు రూ. 92 వేలుగా కాగ్‌ నివేదికలో పేర్కొందని, ఆ తర్వాత సంవత్సరాల్లో అది మరింత పెరుగుతుందని.. దాని ఆధారంగా చూస్తే ఐదేళ్లలో తలసరి అప్పు రూ. 5.50 లక్షలవుతుందని విశ్లేషించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన బడ్జెటేతర రుణాలనూ కలిపితే ప్రజల తలసరి అప్పు మరింత పెరుగుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో వివిధ రూపాల్లో చేసిన రుణాలను కలిపితే మొత్తం అప్పులు రూ. 12.50 లక్షల కోట్లు దాటనున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేస్తున్నా కేంద్రం, ఆర్‌బీఐ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వీడియో సమావేశం ద్వారా ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘మూడేళ్ల కాగ్‌ నివేదికలను పరిశీలిస్తే.. బడ్జెటేతర రుణాలు దాదాపు రూ.5 లక్షల కోట్లు అవుతున్నాయి. ఓడీ, స్పెషల్‌డ్రాయింగ్‌ అలవెన్సులు కలిపి ఐదేళ్లలో రూ.లక్షల కోట్లకు చేరనున్నాయి. అన్నీ కలిపి రూ. 12.5 లక్షల కోట్లకు చేరే ప్రమాదముంది. మార్చి 2024నాటికి అవుట్‌స్టాండింగ్‌ అప్పులు పెరగనున్నాయి. ఇంత జరుగుతున్నా ఆర్‌బీఐ ఇంకా అప్పులకు అనుమతిస్తూనే ఉంది’ అని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని