పొలిట్‌బ్యూరోలోనే రాఘవులు

బి.వి.రాఘవులు పొలిట్‌బ్యూరోకు ఎన్నికైన సభ్యుడు.. ఇక ముందూ ఆ పదవిలోనే కొనసాగుతారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు.

Published : 28 Mar 2023 04:25 IST

ఏపీ పార్టీలో నిర్మాణ సమస్యలున్నాయ్‌..
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

ఈనాడు, దిల్లీ: బి.వి.రాఘవులు పొలిట్‌బ్యూరోకు ఎన్నికైన సభ్యుడు.. ఇక ముందూ ఆ పదవిలోనే కొనసాగుతారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. దిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పొలిట్‌బ్యూరో నుంచి తనను రిలీవ్‌ చేయాలంటూ రాఘవులు రాసిన లేఖపై వివరణ కోరగా ఆయన స్పందించారు. పార్టీకి సంబంధించి ఏపీలో కొన్ని నిర్మాణ, అంతర్గత సమస్యలున్నాయని తెలిపారు. ఆయా సమస్యలపై పొలిట్‌బ్యూరోలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నామని, రాష్ట్ర కమిటీతో చర్చించి అమలు చేస్తామని అన్నారు. రాఘవులు రాసిన లేఖకు సంబంధించి తాను మీడియాతో ఏం చెప్పకపోయినా.. తానే చెప్పినట్లు ఒక ఛానల్‌ (ఈటీవీ కాదు) ప్రసారం చేసిందని ఏచూరి తెలిపారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ.గఫూర్‌ పార్టీకి రాజీనామా చేసేందుకు ప్రయత్నించినట్లు వచ్చిన వార్తలపైనా ఏచూరి స్పందించారు. గఫూర్‌ తమ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడని, రాజీనామాపై తమకు ఎలాంటి సమాచారం రాలేదని అన్నారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ భారాస ఎమ్మెల్సీ కవితతో పాటు విపక్ష నేతలపై సినిమాటిక్‌గా కేసులు పెడుతున్నారని, దీన్ని ఖండిస్తున్నామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని