మిస్టర్‌ మోదీ... విచారణంటే అంత భయమేల?: రాహుల్‌

సామాన్య ఉద్యోగులు దాచుకున్న పింఛను సొమ్మును వివాదాస్పద అదానీ గ్రూపుల్లో ఎందుకు పెట్టుబడిగా పెట్టారో చెప్పాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్రమోదీని డిమాండ్‌ చేశారు.

Updated : 28 Mar 2023 06:14 IST

దిల్లీ: సామాన్య ఉద్యోగులు దాచుకున్న పింఛను సొమ్మును వివాదాస్పద అదానీ గ్రూపుల్లో ఎందుకు పెట్టుబడిగా పెట్టారో చెప్పాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్రమోదీని డిమాండ్‌ చేశారు. సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ ద్వారా ఆయన సోమవారం ప్రధానికి పలు ప్రశ్నలు సంధించారు. ‘‘ఎల్‌ఐసీ మూలధనం అదానీ గ్రూపుల్లోకి. ఎస్‌బీఐ సొమ్ము అదానీ గ్రూపుల్లోకి... ఇప్పుడు ఇంత గొడవ అవుతున్నా... అవినీతి బయటపడినా... ఉద్యోగులు పింఛను కోసం దాచుకున్న సొమ్మూ అదానీ గ్రూపులోనే ఎందుకని పెట్టుబడి పెడుతున్నారు? మిస్టర్‌ ప్రధాని... ఎందుకని దీనిపై సమాధానం చెప్పరు? ఎందుకని విచారణ జరిపించరు? ఎందుకంత భయపడుతున్నారు?’’ అని రాహుల్‌ నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని