రేవంత్‌రెడ్డి కబ్జాకోరు.. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శ

రాత్రికిరాత్రే భూకబ్జాలు చేసే వ్యక్తి రేవంత్‌రెడ్డి అని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.

Published : 28 Mar 2023 04:34 IST

బాన్సువాడ, న్యూస్‌టుడే: రాత్రికిరాత్రే భూకబ్జాలు చేసే వ్యక్తి రేవంత్‌రెడ్డి అని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. సోమవారం రాత్రి కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో భారాస నాయకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన పోచారం మాట్లాడుతూ అమాయకులపై కేసులు పెట్టించి భూకబ్జాలకు పాల్పడే వ్యక్తి పీసీసీ అధ్యక్షుడిగా ఉండటం కాంగ్రెస్‌ పార్టీకి దురదృష్టకరమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రానికి ప్రత్యేక నిధులు తీసుకురాలేని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అసమర్థుడని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకే ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ చేపడుతున్నట్లు ఆయన ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు