నేడు తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం

తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఎన్టీఆర్‌ భవన్‌లో జరుగనుంది.

Published : 28 Mar 2023 04:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఎన్టీఆర్‌ భవన్‌లో జరుగనుంది. తెలంగాణకు సంబంధించిన నాలుగు అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నారు. అకాల వర్షాలు, పంట నష్టం- కష్టాల్లో రైతాంగం; రాష్ట్రంలో నెరవేరని ప్రభుత్వ హామీలు; సభ్యత్వ నమోదు; పార్టీ సంస్థాగత బలోపేతం, సాధికార సారథులు అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్రతినిధుల సభ నిర్వహణకు ఏర్పాటు చేసిన 11 కమిటీల వివరాలను సోమవారం అధికారికంగా ప్రకటించారు.

సభకు పకడ్బందీగా ఏర్పాట్లు..

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఈ నెల 29న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహణ ఏర్పాట్లను సోమవారం సాయంత్రం నేతలతో కలిసి తెదేపా తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ పరిశీలించారు. సభకు హాజరయ్యే ముఖ్య నేతలకు, పార్టీ ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని నిర్వహణ కమిటీ సభ్యులకు సూచించారు. కాసాని వెంట పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న, మీడియా కో-ఆర్డినేటర్‌ బియ్యని సురేశ్‌, అట్లూరి సుబ్బారావు తదితరులున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని