పార్లమెంట్‌ వాయిదాలతో ప్రయోజనం శూన్యం

ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా పార్లమెంట్‌ సమావేశాలను వాయిదా వేస్తూ పోతే ప్రయోజనం ఉండదని భారాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు.

Published : 28 Mar 2023 04:34 IST

నల్ల చొక్కాలు ధరించి సభలో, బయట భారాస ఎంపీల నిరసన

ఈనాడు, దిల్లీ: ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా పార్లమెంట్‌ సమావేశాలను వాయిదా వేస్తూ పోతే ప్రయోజనం ఉండదని భారాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. అదానీ కంపెనీలపై  హిండెన్‌బర్గ్‌ నివేదికకు సంబంధించి విచారణ జరిపేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని (జేపీసీ) ఏర్పాటు చేయాలని భారాస పార్లమెంట్‌, లోక్‌సభాపక్ష నేతలు కేశవరావు, నామా నాగేశ్వరరావులు సోమవారం ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ఉభయ సభాపతులు వాటిని తిరస్కరించడంతో ఎంపీలు సభల్లో నిరసన తెలిపారు. సభలకు భారాస సభ్యులు నల్ల చొక్కాలు, నల్ల కండువాలు ధరించి హాజరయ్యారు. అనంతరం విపక్ష ఎంపీలతో కలిసి పార్లమెంట్‌ ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కేశవరావు, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్‌ నేత, బీబీ పాటిల్‌, పసునూరి దయాకర్‌, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్‌కుమార్‌, దీవకొండ దామోదర్‌రావు, పార్థసారథిరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని