కేసీఆర్‌ ప్రభుత్వ కుట్రలు, కేసులకు భాజపా భయపడదు: ఈటల

కేసీఆర్‌ ప్రభుత్వం బనాయించే కేసులు, పన్నే కుట్రలకు భాజపా భయపడదని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

Published : 28 Mar 2023 04:34 IST

చంచల్‌గూడ, న్యూస్‌టుడే: కేసీఆర్‌ ప్రభుత్వం బనాయించే కేసులు, పన్నే కుట్రలకు భాజపా భయపడదని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో కేసీఆర్‌ ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ తప్పు చేస్తే.. శిక్ష మాత్రం బీజేవైఎం నాయకులకా అని ప్రశ్నించారు. లీకేజీపై చేపట్టిన ఆందోళన సందర్భంగా అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న బీజేవైఎం నాయకులను ఆయన సోమవారం పరామర్శించారు. జైలు బయట మీడియాతో మాట్లాడారు. దోషులను వదిలేసి.. బీజేవైఎం నాయకులపై కేసులు పెట్టి బెయిల్‌ రాకుండా ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ పాలక మండలిని రద్దు చేసి నిపుణులతో కొత్తగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని