తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్‌ కుటుంబం కోసమేనా?

ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణను సాధించుకుంది కేసీఆర్‌ కుటుంబంలోని నలుగురి కోసమేనా అని ఒక్కసారి ఆలోచించుకోవాలని ప్రజలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు.

Published : 28 Mar 2023 04:34 IST

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

రెబ్బెన, న్యూస్‌టుడే: ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణను సాధించుకుంది కేసీఆర్‌ కుటుంబంలోని నలుగురి కోసమేనా అని ఒక్కసారి ఆలోచించుకోవాలని ప్రజలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు. కుమురం భీం జిల్లా రెబ్బెన మండలంలో ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ పాదయాత్ర కొనసాగింది. సోమవారం రాత్రి రెబ్బెన మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో భట్టి మాట్లాడారు. జల్‌ జంగల్‌ జమీన్‌ కోసం పోరాడిన కుమురం భీం స్ఫూర్తిని భారాస ప్రభుత్వం పాటించడంలేదని ఆరోపించారు. సామాజిక తెలంగాణ నిర్మాణమే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కుమురం భీం జిల్లాలో ఎనిమిది రోజుల పాటు 96 కిలోమీటర్ల మేర కొనసాగిన ఈ యాత్ర మంగళవారం నుంచి మంచిర్యాల జిల్లాలో ప్రారంభమవనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు