ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించండి: చాడ

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై సిట్‌ విచారణతో పాటు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి కోరారు.

Updated : 28 Mar 2023 06:10 IST

భగత్‌నగర్‌, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై సిట్‌ విచారణతో పాటు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి కోరారు. సోమవారం కరీంనగర్‌లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తృతస్థాయి కౌన్సిల్‌ సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేపర్‌ లీకేజీకి ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలన్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తే.. పెద్ద తలకాయల పేర్లు బయటకొచ్చే అవకాశముందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కాళేశ్వరం జలాలు తప్ప నిధులు, నియామకాల్లో ఆశించిన మేర ఫలితాలు సాధించలేదన్నారు. భారత్‌ ఖేత్‌ మజ్దూర్‌ యూనియన్‌(బీకేఎంయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి గుల్జార్‌ సింగ్‌ గోరియా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క బాలమల్లేశ్‌, జాతీయ ఉపాధ్యక్షుడు టి.వెంకట్రాములు, జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు మోతె లింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కె.కాంతయ్య, రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్‌, 32 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు