కాంగ్రెస్‌ ఆత్మవిమర్శ చేసుకోవాలి: భాజపా

రాజకీయ, న్యాయ వ్యవస్థల్లో ఆమోదయోగ్యమైనవి ఏవి అనే విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తీవ్రస్థాయిలో ఆత్మవిమర్శ చేసుకోవాలని, నాటకాలకు స్వస్తి పలకాలని భాజపా సూచించింది.

Published : 28 Mar 2023 05:17 IST

దిల్లీ: రాజకీయ, న్యాయ వ్యవస్థల్లో ఆమోదయోగ్యమైనవి ఏవి అనే విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తీవ్రస్థాయిలో ఆత్మవిమర్శ చేసుకోవాలని, నాటకాలకు స్వస్తి పలకాలని భాజపా సూచించింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సస్పెన్షన్‌పై ఆ పార్టీ దేశవ్యాప్తంగా చేస్తున్న నిరసనల మీద కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి సోమవారం ఈ మేరకు వ్యాఖ్యానించారు. కోర్టులో శిక్ష పడడం వల్లనే రాహుల్‌గాంధీ అనర్హతకు గురయ్యారని, దానిపై నాటకీయత అనవసరమని అన్నారు. సావర్కర్‌లాంటి వారు ప్రజల కోసం ఏం చేశారనేది రాహుల్‌కు తెలుసా అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యల్ని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఖండించారు.

రాహుల్‌పై కేంద్రమంత్రుల ధ్వజం

తాను సావర్కర్‌ను కాదంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ ధ్వజమెత్తారు. కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోని ఆయన ఎప్పటికీ సావర్కర్‌ కాలేరని అన్నారు. ‘ఇప్పుడు ఈ డ్రామా అంతా ఎందుకు చేస్తున్నారు? సావర్కర్‌ ఎన్నడూ ఏడాదిలో ఆరు నెలలు విదేశీ యాత్ర చేయలేదు. సొంతదేశానికి వ్యతిరేకంగా విదేశీ సాయాన్ని కోరలేదు’ అని వ్యంగ్యంగా అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు