రాహుల్‌పై చర్య.. భాజపా నిరంకుశత్వం: ఏచూరి

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై లోక్‌సభలో ఆగమేఘాలపై వేటు వేయడం భాజపా నిరంకుశత్వానికి దర్పణం పడుతోందని సీపీఎం ధ్వజమెత్తింది. ఈ వైఖరి భాజపా అసహనాన్ని చాటుతోందని విమర్శించింది.

Published : 28 Mar 2023 05:17 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై లోక్‌సభలో ఆగమేఘాలపై వేటు వేయడం భాజపా నిరంకుశత్వానికి దర్పణం పడుతోందని సీపీఎం ధ్వజమెత్తింది. ఈ వైఖరి భాజపా అసహనాన్ని చాటుతోందని విమర్శించింది. ఈ నెల 25, 26 తేదీల్లో దిల్లీలో జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించిన అంశాలు, చేసిన తీర్మానాలను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సోమవారం విలేకరుల సమావేశంలో వివరించారు. ‘‘విపక్ష నేతలపైకి దర్యాప్తు సంస్థల్ని పంపిస్తూ అధికార దుర్వినియోగానికి భాజపా పాల్పడుతోంది. చిన్నచిన్న కారణాలతో రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెడుతోంది. దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి సిసోదియా అరెస్టు, ఆర్జేడీ నేతలు లాలూప్రసాద్‌, తేజస్వీ, భారాస నాయకురాలు కె.కవితలపై కేసులు దీనికి ఉదాహరణ. అదానీ గ్రూపు తప్పులను భాజపా ప్రభుత్వం నిస్సిగ్గుగా సమర్థించుకొంటోంది’’ అని ఏచూరి పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు