‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు

‘పార్టీని నమ్ముకొని ఉండటం మాదే పొరపాటు. మిమ్మల్ని నమ్మి ఊరు మొత్తం ఓట్లేస్తే.. కాలువలు నిర్మించారా, ఓ రోడ్డేశారా? కనీసం తాగునీటి కుళాయిలైనా వేయగలిగారా..?’ అంటూ ఎచ్చెర్ల నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ను సొంత పార్టీ కార్యకర్తలు నిలదీశారు.

Published : 29 Mar 2023 05:48 IST

జి.సిగడాం, న్యూస్‌టుడే: ‘పార్టీని నమ్ముకొని ఉండటం మాదే పొరపాటు. మిమ్మల్ని నమ్మి ఊరు మొత్తం ఓట్లేస్తే.. కాలువలు నిర్మించారా, ఓ రోడ్డేశారా? కనీసం తాగునీటి కుళాయిలైనా వేయగలిగారా..?’ అంటూ ఎచ్చెర్ల నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ను సొంత పార్టీ కార్యకర్తలు నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయబోమని తేల్చి చెప్పారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మదుపాం, నల్లిపేటలో మంగళవారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదుపాంలో పర్యటిస్తుండగా.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని సర్పంచి అప్పలనాయుడు, గ్రామస్థులు నిలదీశారు. గెలిచిన వెంటనే శంకుస్థాపన చేసిన పనుల ఊసేదని ప్రశ్నించారు. అనంతరం ఎమ్మెల్యే నల్లిపేటకు వెళ్లగా.. అర్హులకు పథకాలు అందడం లేదని అక్కడి వారూ ఆందోళన వ్యక్తంచేశారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఓటేయబోమన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని