వనపర్తి జడ్పీ సమావేశానికి భారాస సభ్యుల గైర్హాజరు

మంత్రి నిరంజన్‌రెడ్డి, వనపర్తి జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ల మధ్య విభేదాల ప్రభావం ఆ జడ్పీ సర్వసభ్య సమావేశంపై పడింది.

Published : 29 Mar 2023 05:09 IST

కోరం లేకపోవడంతో నేటికి వాయిదా

వనపర్తి, న్యూస్‌టుడే: మంత్రి నిరంజన్‌రెడ్డి, వనపర్తి జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ల మధ్య విభేదాల ప్రభావం ఆ జడ్పీ సర్వసభ్య సమావేశంపై పడింది. నిరంజన్‌రెడ్డితో విభేదిస్తూ జడ్పీ ఛైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి ఇటీవల భారాసకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించగా ఛైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, శ్రీరంగాపూరు జడ్పీటీసీ సభ్యుడు (కాంగ్రెస్‌) హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 14 మంది జడ్పీటీసీ సభ్యులు, ఇద్దరు కో-ఆప్షన్‌ సభ్యులున్నారు. ఇద్దరు మినహా 14 మంది గైర్హాజరయ్యారు. కోరం లేకపోవడంతో సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేశారు. జడ్పీ ఛైర్మన్‌ మాట్లాడుతూ.. మంత్రి పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా ఓ నేత, కొందరు ఎమ్మెల్యేలు సభ్యులకు ఫోను చేసి సమావేశానికి హాజరుకాకుండా చూశారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని