జేపీసీ వేసేవరకు వెనకడుగు వేయబోం: భారాస ఎంపీలు

హిండెన్‌బర్గ్‌ నివేదికపై సంయుక్త పార్లమెంటరీ బృందం (జేపీసీ) నియమించే వరకు వెనకడుగు వేయబోమని భారాస ఎంపీలు తెలిపారు.

Updated : 29 Mar 2023 06:19 IST

ఈనాడు, దిల్లీ: హిండెన్‌బర్గ్‌ నివేదికపై సంయుక్త పార్లమెంటరీ బృందం (జేపీసీ) నియమించే వరకు వెనకడుగు వేయబోమని భారాస ఎంపీలు తెలిపారు. హిండెన్‌బర్గ్‌ నివేదికపై చర్చించాలంటూ భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చించాలని లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ఉభయ సభల్లో మంగళవారం వాయిదా తీర్మానాలు ఇచ్చారు. లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్‌లు వాటిని తిరస్కరించడంతో సభల్లో ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. హిండెన్‌బర్గ్‌ నివేదికపై జేపీసీ డిమాండ్‌ చేస్తూ సాయంత్రం విపక్ష ఎంపీలు దిల్లీలోని ఎర్రకోట వద్ద చేపట్టిన నిరసన ప్రదర్శనలో భారాస ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, బీబీ పాటిల్‌, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని