బీసీలకు ప్రధాని మోదీ చేసిందేమీ లేదు
బీసీ ప్రధానినని చెప్పుకొంటున్న నరేంద్ర మోదీ తొమ్మిదేళ్లలో బీసీలకు చేసిందేం లేదని భారాస ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు.
భారాస ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
ఈనాడు, దిల్లీ: బీసీ ప్రధానినని చెప్పుకొంటున్న నరేంద్ర మోదీ తొమ్మిదేళ్లలో బీసీలకు చేసిందేం లేదని భారాస ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, జనగణనలో కుల గణన చేపట్టాలంటూ దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ ఆధ్వర్యంలో మంగళవారం మహాధర్నా చేపట్టారు. దీనికి హాజరైన భారాస మరో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, వైకాపా ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్‌రావు, ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్‌రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మర క్రాంతికుమార్ యాదవ్, ప్రొఫెసర్ భవన్‌రావు తైవాడే(మహారాష్ట్ర), బైరి రవికృష్ణ (తెలంగాణ) తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్‌లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!
-
Ap-top-news News
తిరుమల గగనతలంలో విమానాలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/06/2023)