కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలి: అర్వింద్‌

టీఎస్‌పీఎస్సీ నుంచి ప్రశ్నపత్నం లీకేజీ వ్యవహారంపై ఈడీ, సీబీఐ వంటి కేంద దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ డిమాండ్‌ చేశారు.

Published : 29 Mar 2023 05:29 IST

ఈనాడు, దిల్లీ: టీఎస్‌పీఎస్సీ నుంచి ప్రశ్నపత్నం లీకేజీ వ్యవహారంపై ఈడీ, సీబీఐ వంటి కేంద దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ డిమాండ్‌ చేశారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో తనకు ఏమీపట్టనట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఘటనను ఇద్దరు ఉద్యోగులపైకి తోసి లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని విమర్శించారు. లీకేజీపై రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ నిష్పక్షపాతంగా పనిచేయట్లేదన్నారు. లీకేజీలో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నందున రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 317ను అమలుచేసి.., వారిని ఆయా పదవులనుంచి తొలగించాలని అర్వింద్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని