మా తాత క్షమాపణలు చెప్పారని నిరూపించండి

వీర్‌ సావర్కర్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇటీవల చేసిన ‘క్షమాపణ’ వ్యాఖ్యలపై సావర్కర్‌ మనవడు రంజిత్‌ సావర్కర్‌ స్పందించారు.

Published : 29 Mar 2023 05:29 IST

రాహుల్‌కు రంజిత్‌ సావర్కర్‌ సవాల్‌

ముంబయి: వీర్‌ సావర్కర్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇటీవల చేసిన ‘క్షమాపణ’ వ్యాఖ్యలపై సావర్కర్‌ మనవడు రంజిత్‌ సావర్కర్‌ స్పందించారు. కాంగ్రెస్‌ నేత తన తాత గురించి తప్పుగా మాట్లాడారని మండిపడ్డారు. దేశ భక్తుడైన సావర్కర్‌ బ్రిటిష్‌ వారికి ఎప్పుడు క్షమాపణలు చెప్పారో సాక్ష్యాధారాలతో నిరూపించాలని రాహుల్‌కు ఆయన సవాలు విసిరారు. రాహుల్‌ వ్యాఖ్యలు చిన్నపిల్లల మాటల్లా ఉన్నాయని, రాజకీయ ప్రచారం కోసం దేశభక్తుల పేర్లను వాడుకోవటం తప్పని దుయ్యబట్టారు. ఈ నేరానికి రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని