లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో సమగ్రంగా విచారణ జరిపించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు.

Published : 30 Mar 2023 06:09 IST

రౌండ్‌టేబుల్‌ సమావేశం, నిరాహార దీక్షలో వక్తలు

ఉస్మానియా యూనివర్సిటీ- నల్లకుంట, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో సమగ్రంగా విచారణ జరిపించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో టీఎస్‌జేఏసీ ఛైర్మన్‌ భట్టు శ్రీహరినాయక్‌ అధ్యక్షతన టీఎస్‌జేఏసీ, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం, హైదరాబాద్‌ విద్యానగర్‌లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష జరిగింది. ఈ సందర్భంగా తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. లీకేజీ ఘటనలో ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులపై కేసులను ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. లీకేజీ వ్యవహారంపై విచారణను సిట్టింగ్‌ జడ్జికి అప్పగించేంత వరకూ ఆందోళనలు చేపడతామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అన్నారు. ఆయా కార్యక్రమాల్లో భాజపా జాతీయ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి, విశ్రాంత ఐఏఎస్‌ ఆకునూరి మురళి, బెల్లయ్యనాయక్‌, ప్రొ.పి.ఎల్‌.విశ్వేశ్వర్‌రావు, దరువు ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు