కేటీఆర్‌పై ప్రతిపక్షాల విమర్శలు సరికాదు: గుత్తా

మంత్రి కేటీఆర్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు.

Updated : 30 Mar 2023 05:59 IST

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: మంత్రి కేటీఆర్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. నల్గొండలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ‘టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి పారదర్శకంగా విధులు నిర్వహిస్తున్నారు. కొందరు వ్యక్తుల కారణంగానే ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  కాంగ్రెస్‌, భాజపాల రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు. వారు కేటీఆర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ప్రధాని మోదీ సీబీఐ, ఈడీలను వాడుకుంటున్నారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు, దిల్లీ మద్యం కేసు విచారణ కక్షపూరిత చర్యలే. రాఫెల్‌, అదానీ కంపెనీల వ్యవహారాల్లో రూ.వేల కోట్ల కుంభకోణాలు దాగున్నా... విచారణ ఎందుకు జరగడం లేదు?’ అని ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని