రాహుల్‌ పిటిషన్‌ సిద్ధం!

కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీకి గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు విధించిన శిక్షను సవాలు చేసేందుకు ఆ పార్టీ న్యాయ నిపుణులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

Published : 30 Mar 2023 04:31 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీకి గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు విధించిన శిక్షను సవాలు చేసేందుకు ఆ పార్టీ న్యాయ నిపుణులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పిటిషన్‌ను వారు తయారు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే వారు ఎగువ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు బుధవారం పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒకటి రెండు రోజుల్లో సూరత్‌ సెషన్స్‌ కోర్టులో ఈ పిటిషన్‌ దాఖలయ్యే అవకాశముందని తెలుస్తోంది. పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి సూరత్‌లోని ట్రయల్‌ కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించిన సంగతి తెలిసిందే. శిక్ష పడిన ఆయనపై లోక్‌సభ సచివాలయం వెంటనే అనర్హత వేటు వేసింది. అధికారిక నివాసాన్నీ ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతో రాహుల్‌ అంశంపై న్యాయపరంగా  పిటిషన్‌ వేయడానికి నేతలు సిద్ధమయ్యారు.

పార్లమెంటులో కాంగ్రెస్‌ కార్యాలయానికి రాహుల్‌

రాహుల్‌ గాంధీ బుధవారం పార్లమెంటులోని కాంగ్రెస్‌ పార్లమెంటరీ కార్యాలయానికి వచ్చారు. అక్కడే ఉన్న కొందరు పార్టీ సభ్యులతో 20 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఆయన కలిసిన వారిలో శివసేన (ఉద్ధవ్‌ వర్గం) నేత సంజయ్‌ రౌత్‌ తదితరులున్నారు. ఆ తర్వాత తన తల్లి సోనియా గాంధీతో కలిసి వెళ్లిపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు