కోనసీమ కేసుల ఎత్తివేత దారుణం

కోనసీమ అల్లర్ల కేసులను కేసులను ఎత్తివేయడం దారుణమని, ఇది ఎంతవరకు సమంజసమని జైభీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్‌కుమార్‌ ప్రశ్నించారు.

Published : 30 Mar 2023 04:46 IST

జైభీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్‌కుమార్‌

ఈనాడు, అమరావతి: కోనసీమ అల్లర్ల కేసులను కేసులను ఎత్తివేయడం దారుణమని, ఇది ఎంతవరకు సమంజసమని జైభీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్‌కుమార్‌ ప్రశ్నించారు. విజయవాడలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కోనసీమకు అంబేడ్కర్‌ పేరు పెట్టడం ప్రభుత్వానికే ఇష్టం లేక.. ఉద్దేశపూర్వకంగానే అల్లర్లు, మారణహోమం జరిగేలా చేశారన్నారు. ‘కేసులు ఎత్తేయడానికి ఇది జగన్‌ సొంత రాజ్యం కాదు. రాజ్యాంగం ప్రకారమే కేసుల ఉపసంహరణ జరగాలి’ అన్నారు. కేసుల ఎత్తివేతపై తాము న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ కూడా ఖండించాలన్నారు. కేసుల ఎత్తివేతపై సీఎం చేసిన ప్రకటన జీవో రూపం దాలిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శ్రావణ్‌కుమార్‌ హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు