అంతా బాగుంది

సావర్కర్‌ అంశంపై మహా వికాస్‌ అఘాడీ కూటమిలో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్‌ వర్గం) నేత సంజయ్‌ రౌత్‌ బుధవారం దిల్లీలో కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌ గాంధీలను కలిశారు. భేటీ అనంతరం ఆయన అంతా బాగుందని చెప్పారు.

Published : 30 Mar 2023 05:20 IST

సోనియా, రాహుల్‌లతో భేటీ తర్వాత సంజయ్‌ రౌత్‌

దిల్లీ: సావర్కర్‌ అంశంపై మహా వికాస్‌ అఘాడీ కూటమిలో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్‌ వర్గం) నేత సంజయ్‌ రౌత్‌ బుధవారం దిల్లీలో కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌ గాంధీలను కలిశారు. భేటీ అనంతరం ఆయన అంతా బాగుందని చెప్పారు. మహారాష్ట్ర పోరాట యోధుడు సావర్కర్‌ను అవమానించేలా మాట్లాడొద్దని ఉద్దవ్‌ ఠాక్రే రాహుల్‌ను హెచ్చరించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ‘ఎన్నో ముఖ్యమైన విషయాలపై చర్చించాం. అంతా బాగుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని రౌత్‌ పేర్కొన్నారు. మహారాష్ట్రతోపాటు దేశమంతా ప్రతిపక్షాలు ఐక్యంగానే ఉన్నాయని తెలిపారు. మహా వికాస్‌ అఘాడీ కలిసికట్టుగానే ఉందని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు