రాహుల్‌.. ఇది మీ ఇల్లే

‘నా ఇల్లు.. రాహుల్‌ గాంధీ ఇల్లు’ అంటూ వారణాసిలో ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత అజయ్‌ రాయ్‌ తన ఇంటి ముందు బోర్డు పెట్టారు.

Published : 30 Mar 2023 05:53 IST

వారణాసిలో ఇంటి ముందు బోర్డు పెట్టిన కాంగ్రెస్‌ నేత

వారణాసి: ‘నా ఇల్లు.. రాహుల్‌ గాంధీ ఇల్లు’ అంటూ వారణాసిలో ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత అజయ్‌ రాయ్‌ తన ఇంటి ముందు బోర్డు పెట్టారు. ఇల్లు ఖాళీ చేస్తానని లోక్‌సభ సెక్రటేరియట్‌కు రాహుల్‌ లేఖ రాసిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే అయిన రాయ్‌ ఈ ప్రతిపాదన చేశారు.

నా ఇల్లు ఇస్తా: దిగ్విజయ్‌

భోపాల్‌: రాహుల్‌ గాంధీ ఉండటానికి తన ఇంటిని ఇస్తానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ తెలిపారు. ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయాలని లోక్‌సభ అధికారులు రాహుల్‌కు సూచించిన నేపథ్యంలో దిగ్విజయ్‌ ఈ ప్రతిపాదన చేశారు. ‘రాహుల్‌ జీ నా ఇల్లు మీ ఇల్లే. ‘మేరా ఘర్‌ ఆప్‌కా ఘర్‌) మిమ్మల్ని స్వాగతిస్తున్నా. మీరు నా ఇంట్లో ఉండటానికి వస్తే అదృష్టంగా భావిస్తా’ అని పేర్కొన్నారు. దేశమంతా గాంధీల కుటుంబమేనని, అంత గొప్ప మనసున్న నేతలవల్లే వసుధైక కుటుంబం అనే భావన మన దేశంలో ఉందని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని