రాష్ట్రపతి తేనీటి విందుకు కాంగ్రెస్‌ గైర్హాజరు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం కొన్ని రాష్ట్రాల ఎంపీలకు ఇచ్చిన తేనీటి విందుకు కాంగ్రెస్‌ గైర్హాజరైంది. ఉత్తర్‌ప్రదేశ్‌ (లోక్‌సభ), రాజస్థాన్‌ (లోక్‌సభ, రాజ్యసభ), మిజోరం, నాగాలాండ్‌, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల ఎంపీలను రాష్ట్రపతి తేనీటి విందుకు ఆహ్వానించారు.

Published : 30 Mar 2023 05:53 IST

దిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం కొన్ని రాష్ట్రాల ఎంపీలకు ఇచ్చిన తేనీటి విందుకు కాంగ్రెస్‌ గైర్హాజరైంది. ఉత్తర్‌ప్రదేశ్‌ (లోక్‌సభ), రాజస్థాన్‌ (లోక్‌సభ, రాజ్యసభ), మిజోరం, నాగాలాండ్‌, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల ఎంపీలను రాష్ట్రపతి తేనీటి విందుకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. రాజస్థాన్‌కు చెందిన స్పీకర్‌ ఓం బిర్లా వచ్చారు. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన సోనియా గాంధీ సహా కాంగ్రెస్‌ ఎంపీలెవరూ హాజరు కాలేదు. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రపతి ఆయా రాష్ట్రాలకు విడివిడిగా తేనీటి విందు ఇస్తున్నారు. వీటిలో చివరి తేనీటి విందును ఈ నెల 31వ తేదీన బిహార్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌, అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపుర్‌, మేఘాలయా ఎంపీలకు ఇవ్వనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు