రేపు తెలంగాణకు భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా

భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా 2023 తెలంగాణ ఎన్నికలపై పార్టీ ఆ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Published : 30 Mar 2023 06:15 IST

ఎన్నికలపై దిశానిర్దేశం.. విస్తృతస్థాయి సమావేశానికి హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా 2023 తెలంగాణ ఎన్నికలపై పార్టీ ఆ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. గత కొన్ని నెలలుగా రాష్ట్ర పార్టీ నిర్వహించిన కార్యక్రమాలను సమీక్షించడంతోపాటు భవిష్యత్‌ కార్యాచరణపై స్పష్టత ఇవ్వనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు రానున్న జె.పి.నడ్డా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి సంగారెడ్డి చేరుకుంటారు. సంగారెడ్డిలో భాజపా జిల్లా కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచే వర్చువల్‌గా భూపాలపల్లి, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌లతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు భాజపా జిల్లా కార్యాలయాలను ప్రారంభిస్తారు. అనంతరం సంగారెడ్డిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తదితరులు పాల్గొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని