అఖండ హిందూ రాజ్యమే లక్ష్యం.. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్
భారతదేశం మరిన్ని ముక్కలు కాకుండా కాపాడుకునేందుకు దేశంలోని వంద కోట్ల మంది హిందువులు అఖండ హిందూ రాజ్యస్థాపన కోసం సంకల్పం తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ పిలుపునిచ్చారు.
భారతదేశం మరిన్ని ముక్కలు కాకుండా కాపాడుకునేందుకు దేశంలోని వంద కోట్ల మంది హిందువులు అఖండ హిందూ రాజ్యస్థాపన కోసం సంకల్పం తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ పిలుపునిచ్చారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని నిర్వహించిన విశాల్ శోభాయాత్రలో భాగంగా బేగంబజార్ ఛత్రి కూడలిలో అఖండ హిందూ రాష్ట్రం కోసం భక్తులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచంలో వివిధ వర్గాలకు మత ప్రాతిపదికన ప్రత్యేక దేశాలు ఉండగా హిందూ రాజ్యం ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు. అఖండ హిందూ రాజ్యంలో దేశ రాజధాని దిల్లీ కాకుండా కాశీ, మధుర, అయోధ్యల్లో ఏదో ఒకటి అవుతుందన్నారు. రాజాసింగ్ సూచన మేరకు.. సభలో పాల్గొన్న వారు అఖండ హిందూ రాజ్య స్థాపనకు మద్దతుగా సెల్‌ఫోన్ టార్చ్‌లైట్లు వెలిగించి మద్దతు తెలిపారు. రాజాసింగ్‌తోపాటు భాజపా యువ మోర్చా హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి లడ్డూ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అబిడ్స్, న్యూస్‌టుడే
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
మీరు సర్వ నాశనం కావాలి.. ప్రజలకు వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా శాపనార్థాలు
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా
-
India News
ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు
-
General News
పెళ్లికి వచ్చినా బలవంతపు తరలింపులేనా?
-
Crime News
కుటుంబంలో మద్యం చిచ్చు.. భార్యాభర్తల ఆత్మహత్య
-
Ts-top-news News
38 రోజులపాటు జోసా కౌన్సెలింగ్