ప్రశ్నపత్రాల లీకేజీపై కాంగ్రెస్‌ ‘విద్యార్థి ఉద్యమాల కమిటీ’ ఏర్పాటు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై కాంగ్రెస్‌ పార్టీ ‘విద్యార్థి ఉద్యమాల కమిటీ’ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవిని ఛైర్మన్‌గా నియమించింది.

Published : 31 Mar 2023 03:56 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై కాంగ్రెస్‌ పార్టీ ‘విద్యార్థి ఉద్యమాల కమిటీ’ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవిని ఛైర్మన్‌గా నియమించింది. యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. సభ్యులుగా పీసీసీ ప్రధాన కార్యదర్శులు మానవతారాయ్‌, బాలలక్ష్మీ, పీసీసీ బీమా విభాగం ఛైర్మన్‌ పవన్‌ మల్లాదిలను నియమించింది. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆదేశాలతో కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో విద్యార్థులు, నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, మేధావులను సమన్వయం చేసుకుంటూ రాజకీయ పార్టీలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఈ కమిటీ రూపొందిస్తుందని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు