‘ఇంటింటికీ తెదేపా’పై చంద్రబాబు ప్రశంసలు

రాష్ట్రంలో చేపడుతున్న ఇంటింటికీ తెదేపా కార్యక్రమం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో జోష్‌ను నింపుతుందంటూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసించారని తెదేపా తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 31 Mar 2023 03:56 IST

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో చేపడుతున్న ఇంటింటికీ తెదేపా కార్యక్రమం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో జోష్‌ను నింపుతుందంటూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసించారని తెదేపా తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయి వరకు విజయవంతంగా తీసుకెళ్లాలని సూచించారన్నారు. బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించిన పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేసిన తెలంగాణ, ఏపీలకు చెందిన తెదేపా కుటుంబ సభ్యులకు కాసాని ధన్యవాదాలు తెలిపారు. సభ విజయవంతం కావడం, పార్టీ అధినేత చంద్రబాబు స్ఫూర్తిదాయక సందేశం తెలంగాణ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపిందన్నారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి వరకు ‘ఇంటింటికీ తెదేపా’ కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని జ్ఞానేశ్వర్‌ విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు