రాహుల్‌ గాంధీని కోర్టుకు లాగుతా!: లలిత్‌ మోదీ వెల్లడి

‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యలపై లండన్‌లోని కోర్టులో రాహుల్‌ గాంధీపై కేసు వేస్తానని ఐపీఎల్‌ కుంభకోణంలో ఆర్థిక అక్రమాలకు పాల్పడి దేశం నుంచి పరారై లండన్‌లో ఉంటున్న లలిత్‌ మోదీ పేర్కొన్నారు.

Published : 31 Mar 2023 03:56 IST

లండన్‌: ‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యలపై లండన్‌లోని కోర్టులో రాహుల్‌ గాంధీపై కేసు వేస్తానని ఐపీఎల్‌ కుంభకోణంలో ఆర్థిక అక్రమాలకు పాల్పడి దేశం నుంచి పరారై లండన్‌లో ఉంటున్న లలిత్‌ మోదీ పేర్కొన్నారు. తనకు ఇప్పటివరకూ ఒక్క కేసులోనూ శిక్ష పడలేదని, అలాంటి తనను పరారైన నేరస్థుడిగా రాహుల్‌ ఎలా విమర్శిస్తారని ఈ 59ఏళ్ల ఐపీఎల్‌ మాజీ అధ్యక్షుడు ప్రశ్నించారు. గాంధీ కుటుంబం కంటే తమ కుటుంబమే దేశానికి ఎక్కువ సేవ చేసిందంటూ తన పూర్వీకుల చిత్రాలను ఆయన ట్విటర్‌లో పెట్టారు.  

*  ప్రధాన మంత్రి మోదీకి అంతర్జాతీయ నేరగాడి మద్దతు లభించిందని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. రాహుల్‌ను లండన్‌ కోర్టుకు ఈడుస్తానన్న లలిత్‌ మోదీ వ్యాఖ్యలపై ఆ పార్టీ స్పందించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు