రాహుల్‌ అనర్హతపై జర్మనీ స్పందనతో రాద్ధాంతం

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై లోక్‌సభలో అనర్హత వేటు పడడం మీద జర్మనీ విదేశాంగ శాఖ స్పందించడం మరో వివాదానికి దారి తీసింది.

Published : 31 Mar 2023 03:56 IST

దిగ్విజయ్‌ ట్వీట్‌ మీద వాగ్బాణాలు

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై లోక్‌సభలో అనర్హత వేటు పడడం మీద జర్మనీ విదేశాంగ శాఖ స్పందించడం మరో వివాదానికి దారి తీసింది. ‘విషయాన్ని గమనంలో తీసుకున్నాం’ అని జర్మనీ చెప్పడాన్ని భాజపా ఆక్షేపించింది. దేశ అంతర్గత విషయాల్లో విదేశీ శక్తుల జోక్యాన్ని విపక్షం ఆహ్వానిస్తోందని మండిపడింది. జర్మనీ విదేశాంగ శాఖకు, అక్కడి ‘డోయ్‌చువెలో’ ఛానల్‌ అంతర్జాతీయ వ్యవహారాల సంపాదకుడు రిచర్డ్‌ వాకర్‌కు కాంగ్రెస్‌ సీనియర్‌నేత దిగ్విజయ్‌సింగ్‌ కృతజ్ఞతలు చెప్పడంతో రాద్ధాంతం మొదలైంది. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎలా అణగదొక్కుతున్నారో రాహుల్‌గాంధీ ఉదంతం ద్వారా రుజువు కావడాన్ని గమనంలో తీసుకున్నందుకు దిగ్విజయ్‌ ట్విటర్లో ధన్యవాదాలు చెప్పారు. దీనిపై కేంద్ర మంత్రులు ఎస్‌.జైశంకర్‌, కిరణ్‌ రిజిజు, నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయల్‌, అనురాగ్‌ ఠాకుర్‌ ఘాటుగా స్పందించారు. విదేశీ జోక్యంతో భారత న్యాయవ్యవస్థ ప్రభావితం కాదనేది గుర్తుంచుకోవాలని, ప్రధానిగా నరేంద్రమోదీ ఉన్నంతకాలం విదేశీ ప్రభావాన్ని సహించేది లేదన్నారు. దీంతో నష్టనివారణ చర్యలపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని