మోదీ వచ్చేవరకూ స్వాతంత్య్ర పోరుపై దుష్ప్రచారం: అమిత్‌ షా

భారత స్వాతంత్య్ర పోరాట గొప్పతనాన్నంతా ప్రధాని మోదీ వచ్చేవరకూ కొందరు ఒకే కుటుంబానికి పరిమితం చేశారని, ఆయన వచ్చాకే సర్దార్‌ పటేల్‌ త్యాగాలను గుర్తు చేయడంద్వారా ఆ దుష్ప్రచారానికి ముగింపు పలికారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.

Updated : 31 Mar 2023 06:16 IST

హరిద్వార్‌: భారత స్వాతంత్య్ర పోరాట గొప్పతనాన్నంతా ప్రధాని మోదీ వచ్చేవరకూ కొందరు ఒకే కుటుంబానికి పరిమితం చేశారని, ఆయన వచ్చాకే సర్దార్‌ పటేల్‌ త్యాగాలను గుర్తు చేయడంద్వారా ఆ దుష్ప్రచారానికి ముగింపు పలికారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. బాబర్‌ కాలం నుంచి అయోధ్యలో రామ మందిర అంశం పెండింగ్‌లో పడిపోయిందని, సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే మోదీ భూమి పూజ చేశారని వెల్లడించారు. వచ్చే శ్రీరామనవమికి రామాలయ నిర్మాణం పూర్తికానుందని తెలిపారు. హరిద్వార్‌లో గురువారం యోగా గురు బాబా రాందేవ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన 2వ సన్యాస్‌ దీక్షా మహోత్సవ్‌లో ఆయన మాట్లాడారు. హిందుత్వ ప్రతీకలకు మోదీ మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేశారని, కాశీ విశ్వనాథ్‌, సోమనాథ్‌ ఆలయాలను పునర్నిర్మించారని, ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న దేవుళ్ల విగ్రహాలను తెప్పించారని వివరించారు. బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయాలను అభివృద్ధి చేశారని, యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని