EC: వయనాడ్‌ ఖర్చులు సమర్పించని ‘రాహుల్‌’పై ఈసీ వేటు!

ఎన్నికల్లో పోటీచేసి, నిర్ణీత గడువులోగా ఆ ఖర్చుల వివరాలను సమర్పించనందుకు రాహుల్‌గాంధీ అనే వ్యక్తిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది.

Updated : 31 Mar 2023 08:32 IST

దిల్లీ: ఎన్నికల్లో పోటీచేసి, నిర్ణీత గడువులోగా ఆ ఖర్చుల వివరాలను సమర్పించనందుకు రాహుల్‌గాంధీ అనే వ్యక్తిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. అయితే ఆయన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ కాదు. ఆయనో స్వతంత్ర అభ్యర్థి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీచేసి 2,196 ఓట్లు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి 7 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి పూర్తి పేరు కె.ఇ.రాహుల్‌గాంధీ. ఎన్నికల ఖర్చులు తెలియజేయనందుకు ఈయన్ని 2021 సెప్టెంబరు 13 నుంచి 2024 సెప్టెంబరు 13 వరకు ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా పరిగణించనున్నట్లు ఈసీ బుధవారం ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు