సంక్షిప్త వార్తలు (4)
పురపాలక సంఘ పరిధిలోని వార్డుల్లో రెండేళ్లలో చేసిన అభివృద్ధి పనుల వివరాలను వార్డుల వారీగా సభ్యులకు ఇవ్వాలని కౌన్సిలర్ చంద్రారెడ్డి కమిషనర్ శ్రీనివాసరావును అడిగారు.
రెండేళ్లలో ఏం అభివృద్ధి చేశాం? ప్రశ్నించిన నాయుడుపేట కౌన్సిలర్లు
నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: పురపాలక సంఘ పరిధిలోని వార్డుల్లో రెండేళ్లలో చేసిన అభివృద్ధి పనుల వివరాలను వార్డుల వారీగా సభ్యులకు ఇవ్వాలని కౌన్సిలర్ చంద్రారెడ్డి కమిషనర్ శ్రీనివాసరావును అడిగారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక సంఘ సమావేశం శుక్రవారం ఛైర్‌పర్సన్ కటంక దీపిక అధ్యక్షత ఏర్పాటు చేశారు. కమిషనర్ మాట్లాడుతుండగా కౌన్సిలర్లు మధ్యలో జోక్యం చేసుకుని అభివృద్ధి పనుల వివరాలను తెలియజేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడగాల్సి ఉందన్నారు. తమ పరిస్థితి ప్రతిపక్ష పార్టీలా ఉందన్నారు. కౌన్సిలర్ విజయ్ మాట్లాడుతూ ఏమీ చేయకపోతే సమావేశాలకు రావడం ఎందుకన్నారు. కౌన్సిలర్ వరలక్ష్మి మాట్లాడుతూ తమ వార్డు పరిధిలో కొన్ని నెలలుగా సైడుకాల్వ నిర్మించాలంటే కాలయాపన చేస్తున్నారని, దానికి ఏమైనా అవసరమైతే ఖర్చు తాను భరిస్తామన్నారు. ఒక దశలో కౌన్సిలర్లకు, కమిషనర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
చంద్రగిరి వైకాపా అభ్యర్థిగా మోహిత్‌రెడ్డి
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
పాకాల, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా తన కుమారుడు మోహిత్‌రెడ్డి పోటీ చేస్తారని ప్రస్తుత శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రకటించారు. తిరుపతి జిల్లా పాకాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో వైఎస్సార్ ఆసరా పథకం చెక్ పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్న నేపథ]్యంలో నేను సీఎం జగన్ వెంట నడవాల్సి ఉంది. చంద్రగిరిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అవకాశం ఉండేలా మోహిత్‌రెడ్డిని అభ్యర్థిగా పంపాలని సీఎం సూచించారు. నన్ను ఆదరించినట్లుగానే నా కుమారుడిని ఆశీర్వదించాలి’ అని కోరారు.
అవినాశ్‌ను అరెస్టు చేస్తారనే భయంతోనే దిల్లీకి వెళ్తున్న సీఎం: ఎమ్మెల్సీ అశోక్‌బాబు
ఈనాడు, అమరావతి: దిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాను కలిసిన ప్రతిసారీ ఒకే విధమైన ప్రకటనను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మీడియాకు ఇస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు ఎద్దేవా చేశారు. ప్రజల కోసం ఏదైనా సాధిస్తే ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి భయమెందుకని ప్రశ్నించారు. భాజపా నేత సత్యకుమార్‌పై ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వివేకా హత్యకేసులో తన తమ్ముడు అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేస్తారనే భయంతోనే అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా జగన్ దిల్లీకి వెళ్తున్నారని విమర్శించారు. ప్రధాని స్థాయి వ్యక్తిని ముఖ్యమంత్రి కలిసినప్పుడు ఏం మాట్లాడారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు.
ఆ వైకాపా కౌన్సిలర్‌ను అరెస్టు చేయాలి: డూండి రాకేశ్
ఈనాడు, అమరావతి: తెనాలిలో తెదేపా కౌన్సిలర్ యుగంధర్‌పై దాడి చేసిన వైకాపా కౌన్సిలర్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని తెలుగు వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేశ్ డిమాండు చేశారు. జగన్‌రెడ్డి రౌడీ పాలనకు ఈ దాడులే నిదర్శనమని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ధ్వజమెత్తారు. ‘కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదనే సంగతి వైకాపా నేతలు గ్రహించాలి. అధికారం ఉంది కదా అని బరి తెగిస్తే భవిష్యత్తులో బడితె పూజ తప్పదు’ అని హెచ్చరించారు.
తెదేపా కౌన్సిలర్‌పై దాడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే
తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్
ఈనాడు డిజిటల్, అమరావతి : గుంటూరు జిల్లా...తెనాలి పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో ఒక సామాజిక వర్గానికి చెందిన తెదేపా కౌన్సిలర్ యుగంధర్‌పై దాడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ‘‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని సుబ్బారావు గుప్తాను గంజాయి కేసులో అరెస్ట్ చేయించిన జగన్‌రెడ్డి సర్కార్..ఇప్పుడు యుగంధర్‌పై రౌడీ మూకలతో దాడి చేయించింది. సీఎం జగన్ మాదిరిగానే వైకాపా కౌన్సిలర్లు కూడా ఒత్తిడిలో ఉన్నారు’’ అని నారా లోకేశ్ శుక్రవారం ట్వీట్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం
-
Politics News
భీమవరంలో ఫ్లెక్సీ వార్
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను