నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్‌, కూర్మయ్యగారి నవీన్‌కుమార్‌, చల్లా వెంకట్రామిరెడ్డిలు ప్రమాణ స్వీకారంచేశారు.

Published : 01 Apr 2023 02:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్‌, కూర్మయ్యగారి నవీన్‌కుమార్‌, చల్లా వెంకట్రామిరెడ్డిలు ప్రమాణ స్వీకారంచేశారు. శుక్రవారం శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఛాంబర్‌లో ఈ కార్యక్రమం జరిగింది.  కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్‌ అలీ, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, యువజన క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, మైనంపల్లి హనుమంతరావు, అబ్రహం, మెతుకు ఆనంద్‌కుమార్‌, శాసనమండలి చీఫ్‌ విప్‌ భానుప్రసాదరావు, విప్‌లు ఎం.ఎస్‌.ప్రభాకర్‌రావు, శంభీపూర్‌ రాజు, కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, దామోదర్‌రెడ్డి, వాణీదేవి, శేరి సుభాష్‌రెడ్డి, ఎల్‌ రమణ, ఎగ్గే మల్లేశం, దండే విఠల్‌, రఘోత్తంరెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొని నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఏవీఎన్‌ రెడ్డి...

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ టీచర్‌ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఇటీవల ఎన్నికైన భాజపా బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డితో శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి  శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో మండలి వైస్‌ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌, భాజపా నాయకులు జితేందర్‌రెడ్డి, రామచందర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్‌ సహా ఇతర నేతలు పాల్గొన్నారు. ప్రమాణస్వీకారానికి ముందు ఏవీఎన్‌ రెడ్డి, భాజపా నేతలు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని