మనుధర్మశాస్త్రాన్ని రద్దు చేయాలి

దేశంలో కులవ్యవస్థకు పునాది అయిన మనుధర్మశాస్త్రాన్ని రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.

Updated : 01 Apr 2023 05:11 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: దేశంలో కులవ్యవస్థకు పునాది అయిన మనుధర్మశాస్త్రాన్ని రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. దళిత హక్కుల పోరాటసమితి (డీహెచ్‌పీఎస్‌) ప్రథమ రాష్ట్ర సభను ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ.. కుల, మత అసమానతలు లేని సమాజ నిర్మాణమే అంతిమ లక్ష్యంగా సీపీఐ పనిచేస్తుందన్నారు. దేశంలోని అసమానతలకు, ఆకలి, అంటరానితనం, అభద్రత, కులోన్మాదం, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలోని సంపదను మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు అక్రమంగా అందిస్తోందని విమర్శించారు. ఆలిండియా దళిత్‌ రైట్స్‌ ఫోరం జాతీయాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రామమూర్తి మాట్లాడుతూ.. భాజపా హయాంలో దేశంలో దళితులపై నిత్యం దాడులు జరుగుతున్నాయని, వాటిని నివారించడంలో విఫలమైందని విమర్శించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు