నిరుద్యోగ యువత సమస్యలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: ప్రవీణ్‌

ఈనాడు, హైదరాబాద్‌: నిరుద్యోగ యువత సమస్యలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Updated : 01 Apr 2023 05:23 IST

శాంతినగర్‌, న్యూస్‌టుడే; ఈనాడు, హైదరాబాద్‌: నిరుద్యోగ యువత సమస్యలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్‌లోని పార్టీ క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 30 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశానని చెప్పారు. గ్రూప్‌-1 పేపర్‌ లీకేజీపై పోలీసులు ప్రత్యేక కేసు నమోదు చేయక పోవడం దారుణమన్నారు. లీకేజీలపై పోరాటం చేసిన విద్యార్థులపై కేసులు పెట్టి అరెస్టు చేశారన్నారు. మంత్రి కేటీఆర్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పీఆర్‌వోగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజోలి లాంటి పెద్ద గ్రామంలో శ్మశానవాటిక లేదని ఆవేదన వ్యక్తంచేశారు.  9న అలంపూర్‌ చౌరస్తాలో 50 కంపెనీలతో మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ప్రమేయం లేకుండా సమాధానాలతో కూడిన ప్రశ్నపత్రం లీక్‌ అవ్వదని... ఛైర్మన్‌తోపాటు మంత్రి కేటీఆర్‌కు కూడా నోటీసులు ఇచ్చి సమగ్ర విచారణ చేపట్టాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం ఓప్రకటనలో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు