లీకేజీ కేసును మూసేందుకే సిట్‌: షర్మిల

టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగ నియామక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో సిట్‌ వేసిన సీఎం కేసీఆర్‌ సునాయాసంగా ఈ వ్యవహారాన్ని మూసివేసేందుకు కుట్ర పన్నారని వైతెపా వ్యవస్థాపకురాలు వై.ఎస్‌.షర్మిల ఆరోపించారు.

Published : 01 Apr 2023 04:05 IST

నాంపల్లి, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగ నియామక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో సిట్‌ వేసిన సీఎం కేసీఆర్‌ సునాయాసంగా ఈ వ్యవహారాన్ని మూసివేసేందుకు కుట్ర పన్నారని వైతెపా వ్యవస్థాపకురాలు వై.ఎస్‌.షర్మిల ఆరోపించారు. సిట్‌ ద్వారా ఈ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో పెద్దవారి ప్రమేయం ఏమీలేదని, కేవలం సామాన్యులే ఈ స్కామ్‌లో పాలుపంచుకున్నారని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం వైతెపా ఆధ్వర్యంలో నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ ముట్టడి పేరుతో ఆందోళన నిర్వహించారు. ఆ పార్టీ కార్యకర్తలు ఒకవైపు నుంచిరాగా, షర్మిల కారులో నాంపల్లికి చేరుకుని కొంతదూరం నుంచి నడిచి టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. కార్యాలయం గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు. ఇంతలో పోలీసులు  షర్మిలతో పాటు నిరసనకారులను అరెస్టు చేశారు. లుకౌట్‌ నోటీసు ఆర్డర్‌ జారీ చేసినట్లు తెలిసిందని, లుకౌట్‌ నోటీసు ఇవ్వడానికి తానేమైనా క్రిమినల్‌నా అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు