‘అమరావతి సభలో’ ప్రత్యేక ఆకర్షణగా పంచుమర్తి, కోటంరెడ్డి

అమరావతి ఉద్యమం ప్రారంభమై 1,200 రోజులవుతున్న సందర్భంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం శిబిరంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

Published : 01 Apr 2023 04:28 IST

ఈనాడు, అమరావతి: అమరావతి ఉద్యమం ప్రారంభమై 1,200 రోజులవుతున్న సందర్భంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం శిబిరంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల తెదేపా తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన పంచుమర్తి అనురాధ, వైకాపా నుంచి బహిష్కరణకు గురైన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్రకు వెళ్తుండగా నెల్లూరు జిల్లాలో తమకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి రైతులు సభలో కృతజ్ఞతలు తెలిపారు.

ఉద్యమానికి విరాళాలు

జైభీమ్‌ పార్టీ తరపున అధినేత జడ శ్రావణ్‌కుమార్‌ రూ.50 వేలు, బీఎస్‌ఎన్‌ఎల్‌ విశ్రాంత ఉద్యోగి వేములపల్లి విఠల్‌ రూ.50 వేలు, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన తలగూర అశోక్‌ రూ.40 వేలు, హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వెనిగళ్ల గోపీకృష్ణ రూ.25 వేలు ఉద్యమానికి విరాళంగా అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని