కాలర్‌ పట్టుకుంటామని కాళ్లు పట్టుకుంటున్నారు

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా సాధనకు కాలర్‌ పట్టుకుంటామన్న జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు.

Updated : 01 Apr 2023 10:54 IST

సీఎం జగన్‌పై ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శ

ఈనాడు, దిల్లీ: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా సాధనకు కాలర్‌ పట్టుకుంటామన్న జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉత్తర కుమారుడిగా సంబోధించిన ముఖ్యమంత్రి జగన్‌.. ఈ విషయంలో ఏమీ చేయలేని ఉత్త కుమారుడిగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. దిల్లీలో ఎంపీ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి ప్రత్యేక హోదా గుర్తుకొచ్చినప్పుడే ఎంపీ వివేకా హత్య కేసు కోర్టులో విచారణకు వస్తుందో..లేదంటే ఆ కేసు విచారణకు వచ్చినప్పుడే ముఖ్యమంత్రికి ప్రత్యేక హోదా, పోలవరం గుర్తుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి దిల్లీ వచ్చిన రోజే వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఎంపీ అవినాష్‌రెడ్డికి కొంత వెసులుబాటు లభించినట్లు తమ పార్టీ నేతలు భావిస్తున్నారని తెలిపారు.  పోలవరం ప్రాజెక్టు నిధుల కోసమే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ని ముఖ్యమంత్రి కలిశారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని