నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడదాం

నిరుద్యోగుల సమస్యల విషయంలో కలిసి పోరాడదామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు.

Published : 02 Apr 2023 04:13 IST

బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డిలకు వై.ఎస్‌.షర్మిల ఫోన్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: నిరుద్యోగుల సమస్యల విషయంలో కలిసి పోరాడదామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఆమె వారికి ఫోన్‌ చేశారు. పోరాటానికి ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని, ప్రగతిభవన్‌ మార్చ్‌కు పిలుపునిద్దామని సూచించారు. కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పోరాటానికి మద్దతు ఇస్తానని బండి సంజయ్‌ చెప్పారని, త్వరలోనే సమావేశం అవుదామని పేర్కొన్నారని షర్మిల తెలిపారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు