కాంట్రాక్ట్‌ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి

ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను వెంటనే క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు.

Published : 02 Apr 2023 04:09 IST

ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్‌

కవాడిగూడ, న్యూస్‌టుడే: ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను వెంటనే క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌లో   నర్సిరెడ్డి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు  ఏప్రిల్‌ 1న ఉత్తర్వులు జారీ చేస్తామని 2023 బడ్జెట్‌ సమావేశాల్లో సీఎం చెప్పారు...అలా చేయనందుకు నిరసనగా తాను ధర్నా చేపట్టినట్లు వివరించారు. యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి చావ రవి, మాణిక్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఆయనను గాంధీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రావు, సిబ్బంది అరెస్టు చేసి, తర్వాత విడుదల చేశారు.

* రాష్ట్రంలోని జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం శనివారం సీఎం కేసీఆర్‌కు ఆన్‌లైన్‌లో వినతిపత్రం పంపింది. ఏప్రిల్‌ 1న ఉత్తర్వులు రాకపోవడంతో వేలమంది అధ్యాపకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కొప్పిశెట్టి సురేష్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు