మంత్రిగారూ.. నీటి బిల్లులు ఇప్పించండి

నీటి బిల్లులు ఇప్పించాలని కోరుతూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను వైకాపా కార్యకర్తలు, నాయకులు చుట్టుముట్టిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులో శనివారం చోటుచేసుకుంది.

Published : 02 Apr 2023 04:09 IST

ఆదిమూలపు సురేష్‌ను చుట్టుముట్టిన వైకాపా కార్యకర్తలు

పెద్దారవీడు, న్యూస్‌టుడే: నీటి బిల్లులు ఇప్పించాలని కోరుతూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను వైకాపా కార్యకర్తలు, నాయకులు చుట్టుముట్టిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులో శనివారం చోటుచేసుకుంది. ‘జగనన్నే మా నమ్మకం’ కార్యక్రమంలో భాగంగా దేవరాజుగట్టు పోలీస్‌స్టేషన్‌ సమీపంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయనను కార్యకర్తలు,  నాయకులు చుట్టుముట్టి సమస్యలను వివరించారు. పుచ్చకాయలపల్లికి చెందిన వైకాపా నాయకుడు మారంరెడ్డి మల్లారెడ్డి నీటి బిల్లులు ఇప్పించాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అక్కడే ఉన్న మరికొందరు సర్పంచులు, నాయకులు ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి ఉందని, రెండేళ్లుగా నీటి బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. స్పందించిన మంత్రి.. బిల్లులు వచ్చేలా చర్యలు తీసుకుంటానన్నారు. 2024లో మళ్లీ అధికారంలోకి వస్తామని, ప్రతి ఒక్కరి సమస్యలు తీరుస్తామని వారికి సర్ది చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని