మంత్రి సమావేశం.. గేటుకు తాళం

శ్రీకాకుళం టౌన్‌హాల్‌లో శనివారం వైఎస్సార్‌ ఆసరా మూడో విడత నగదు పంపిణీ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర అసహనానికి గురయ్యారు.

Updated : 02 Apr 2023 05:46 IST

దాన్ని తీసినవాడి గూబ మీద కొట్టండంటూ ధర్మాన అసహనం

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం టౌన్‌హాల్‌లో శనివారం వైఎస్సార్‌ ఆసరా మూడో విడత నగదు పంపిణీ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇటీవల నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరవుతున్న మహిళలు మంత్రి ప్రసంగానికి ముందే తిరిగి వెళ్లిపోతుండటంతో శనివారం టౌన్‌హాల్‌ ప్రాంగణంలోని మూడు గేట్లకు అధికారులు తాళాలు వేశారు. మంత్రి ధర్మాన ప్రసంగిస్తున్నప్పుడు ఓ గేటు తాళం ఎవరో తీయడంతో మహిళలు పెద్ద సంఖ్యలో బయటకు వెళ్లిపోయారు. గమనించిన ఆయన ‘ఏయ్‌ ఆ గేటు తాళాలు ఎవడు తీశాడు? వాడి గూబ మీద ఒకటి కొట్టండి’ అంటూ వేదిక వద్దనున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఈ గేట్ల వద్ద సిబ్బంది ఉండి సమావేశానికి వచ్చేవారిని లోపలికి పంపారు. మంత్రి వచ్చాక అన్ని గేట్లకు తాళాలేసేశారు. ఈ క్రమంలో కొందరు మహిళలు మంత్రి ప్రసంగానికి ముందే గోడలు దూకి వెళ్లిపోయారు. వెళ్లలేనివారు బంధించడం ఇదేం పద్ధతంటూ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలస్యంగా వచ్చినవారు లోపలికి వెళ్లే అవకాశం లేక కాసేపు నిరీక్షించి ఇంటిముఖం పట్టారు. ‘10 నిమిషాల్లో గేట్లకు తాళాలు తీసేస్తాం. సహకరించండి’ అంటూనే మంత్రి ప్రసంగం ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు