సమర్థించుకోవడం కాదు.. విధుల్లోంచి తొలగించండి

నిషేధిత భూముల జాబితా నుంచి దేవాలయ భూమిని తొలగించడం చట్టాన్ని అతిక్రమించడమేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.

Published : 02 Apr 2023 04:54 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: నిషేధిత భూముల జాబితా నుంచి దేవాలయ భూమిని తొలగించడం చట్టాన్ని అతిక్రమించడమేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ‘‘ఈ చర్యను న్యాయస్థానం ఎదుట సమర్థించుకునే ప్రయత్నానికి బదులుగా తక్షణమే సంబంధిత అధికారిని విధుల నుంచి తొలగించి విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నా’’ అని శనివారం సోము వీర్రాజు ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని