బిహార్‌ కంటే ఏపీలోనే యువత ఆత్మహత్యలు ఎక్కువ

వెనకబడిన రాష్ట్రం బిహార్‌ కంటే ఏపీలోనే యువత ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు పేర్కొన్నారు.

Published : 02 Apr 2023 04:54 IST

తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వెనకబడిన రాష్ట్రం బిహార్‌ కంటే ఏపీలోనే యువత ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత బలవన్మరణాలకు పాల్పడటానికి జగన్‌ అవినీతి, అసమర్థత, ధనదాహమే కారణమని ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘2019లో 6,469 మంది, 2020లో 7,043 మంది, 2021లో 8,067 మంది యువత రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నట్లు పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రం వెల్లడించింది. చదువుకు తగ్గ ఉద్యోగాలు, ఉపాధి దొరక్కే వీరి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇది పాలకులకు సిగ్గుచేటు. పారిశ్రామిక కేంద్రంగా మార్చాల్సిన రాష్ట్రాన్ని మాదకద్రవ్యాలకు హబ్‌గా మార్చారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని జగన్‌ తుంగలో తొక్కారు...’ అని పేర్కొన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు అమలు చేసి రాష్ట్రవ్యాప్తంగా 2.94 లక్షల మందికి శిక్షణ ఇచ్చి...70 వేల మందికి ఉద్యోగాలు కల్పించాం. అలాంటి ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేస్తూ దాన్ని అటకెక్కించారు...’’ అని అశోక్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు