Naga Babu: రామోజీరావు లక్షల మందికి ఆదర్శం: జనసేన నేత నాగబాబు

‘‘తెలుగు మీడియా, సినీ రంగాల్లో విప్లవాత్మకమైన అభివృద్ధిని తీసుకొచ్చి, వ్యాపార రంగంలో వేల మందికి జీవనాధారం కల్పిస్తూ కళా రంగంలో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు దక్కించుకుని, ప్రపంచ స్థాయిలో తెలుగు ఖ్యాతిని చాటి చెప్పిన పద్మవిభూషణ్‌ రామోజీరావు లక్షల మందికి ఆదర్శప్రాయులు.

Updated : 05 Apr 2023 08:33 IST

ఈనాడు, అమరావతి: ‘‘తెలుగు మీడియా, సినీ రంగాల్లో విప్లవాత్మకమైన అభివృద్ధిని తీసుకొచ్చి, వ్యాపార రంగంలో వేల మందికి జీవనాధారం కల్పిస్తూ కళా రంగంలో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు దక్కించుకుని, ప్రపంచ స్థాయిలో తెలుగు ఖ్యాతిని చాటి చెప్పిన పద్మవిభూషణ్‌ రామోజీరావు లక్షల మందికి ఆదర్శప్రాయులు. ఆరు దశాబ్దాల ప్రస్థానంలో ఆయనకు ఎదురుకాని ఆరోపణలు వైకాపా అధికారంలోకి వచ్చాకే పుట్టుకురావడం విచారకరం. ఎనిమిది పదుల వయసు పైబడిన రామోజీరావును, ఆయన కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం శోచనీయం’’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కె.నాగబాబు మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో ఖండించారు. రామోజీరావుపై సామాజిక మాధ్యమాల్లో కావాలని చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని