CPI Narayana: ‘మార్గదర్శి’పై వైఎస్‌ కుటుంబం కక్ష: నారాయణ

‘మార్గదర్శిపై దాడులు కొత్తేమీ కాదు.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సంస్థపై కక్ష కట్టిన మాట వాస్తవం. అనేక రకాలుగా ఆరోపణలు చేశారు’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.

Updated : 07 Apr 2023 07:04 IST

మంగళం (తిరుపతి), న్యూస్‌టుడే: ‘మార్గదర్శిపై దాడులు కొత్తేమీ కాదు.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సంస్థపై కక్ష కట్టిన మాట వాస్తవం. అనేక రకాలుగా ఆరోపణలు చేశారు’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. గురువారం తిరుపతి అర్బన్‌ మండలం శెట్టిపల్లె భూముల పరిశీలనకు వచ్చిన ఆయన ‘మార్గదర్శి’పై జరుగుతున్న దాడులకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘ఆనాడు రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నారు.. కేంద్రంలోనూ కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. రకరకాలుగా ఇబ్బంది పెట్టినా చట్టాల ప్రకారమే మార్గదర్శి నడుస్తోందని బయటపడింది. ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు మళ్లీ రామోజీరావుపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారు’ అని మండిపడ్డారు. కక్షపూరితంగా కాకుండా న్యాయంగా విచారించాలని అన్నారు. ఈ వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కమ్యూనిస్టులపై నిందలు వేసేలా మాట్లాడుతున్నారని, ఎవరి ప్రయోజనాల కోసం ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో తమకు తెలుసని పేర్కొన్నారు. ప్రతిపక్షనాయకుడిగా జగన్‌ ఇచ్చిన హామీ మేరకు శెట్టిపల్లె భూముల సమస్యను పరిష్కరించి రైతులకు, అక్కడ స్థలాలను కొనుగోలు చేసిన వారికి న్యాయం చేయాలని నారాయణ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు